కరీంనగర్ జిల్లా రేకుర్తి 18 డివిజన్ లో సోమవారం నాడు జిల్లా బిజెపి జాయింట్ కోఆర్డినేటర్ జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ 18వ డివిజన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనను స్వాగతిస్తూ డివిజన్ లోని ఇంటింటికి వెళ్తూ అన్ని కులాల వారు బిజెపి సభ్యత్వం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ప్రజలందరికీ అర్థమైందని ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని వారందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం చేయడానికి పార్టీ శ్రేణులు సమిష్టి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేస్తే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని 300 రోజులైనా ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది నెలల్లో 80 వేల కోట్ల అప్పుచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మారుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని కానీ వాటిలో ఒకటి కూడా అమలు లోకి రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనీ ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని ప్రగల్బాలు పలుకుతున్నారే తప్ప వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలో హాసాహనం కోల్పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు


