Sunday, November 3, 2024
spot_img
HomeCINEMAఫిబ్రవరి 3కి ‘మైఖేల్’

ఫిబ్రవరి 3కి ‘మైఖేల్’

సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ అన్నీ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘నువ్వుంటే చాలు’ పాటకు సామ్ సిఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘మైఖేల్’ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్‌లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్‌లు కూడా పోస్టర్ లో కనిపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి‌తో కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. కిరణ్ కౌశిక్ కెమెరా‌మెన్‌గా పని చేస్తున్నారు. త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments