రాజన్న సిరిసిల్ల జిల్లాలో వలసల ప్రవాహం ఆగడం లేదు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్వంత నియోజకవర్గం సిరిసిల్లలో BRS పార్టీ కార్యకర్తల నుండి నాయకుల వరకూ అందరూ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డి పేట పట్టణ BRS పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండారి బాల్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భముగా బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అందువలనే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు.