జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు అనగా సెప్టెంబర్ 29 సోమవారం మహిళలు బతుకమ్మ ఆటలు ఆడేందుకు బతుకమ్మ ఘాట్లలో లైటింగ్, ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ మహిళల సాంప్రదాయ పండుగైన బతుకమ్మ వేడుకలకు మున్సిపల్ శాఖ మున్సిపాలిటీ పరిధిలో 14 చోట్ల బతుకమ్మ ఆటలు మహిళలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు…