సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆప్షన్ ఆధ్వర్యంలో దివ్యాంగులైన చిన్నారులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారి సేవలు అభినందనీయమని అన్నారు. సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఎలాంటి ఆపదలో ఉన్నవారికైనా సేవలు అందిస్తున్న సంస్థ లయన్స్ క్లబ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాసరెడ్డి, పిట్టల వెంకటేశం, తమ్మన వేణి సతీష్. పూసల సాంబమూర్తి. దేశెట్టి రమేష్. మల్లేశం మరియు సిబ్బంది పాల్గొన్నారు