ఎల్లారెడ్డి పేట గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో హోలీ పండుగను పురస్కరించుకుని వసంతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ వేడుకలకు మహిళ భక్తులు ముందుగా దేవాలయం చేరుకొని గోపాలుని ఊయలను పూలమాలలతో అందంగా అలంకరించారు. నవనీత చోరుని మనసు చూరగొనే విధంగా ఆలయాన్ని అలంకరించారు. జో అచ్యుతనంద జోజో ముకుందా లాలి పరమానంద రామగోవిందా, వటపత్ర శాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి అంటూ కీర్తనలు పాడారు. ఆస్థాన అర్చకులు గోపాలచారి, నవీన్ ఆచారి మంత్రోచ్ఛారణలతో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గోపాలుడు మంత్రముగ్దులు అయ్యేవిధంగా పూజ కార్యక్రమం జరిగింది. డోలోత్సవంలో, ఆ గోపాలడే, గోపికలతో హోలీ ఆడీ, రంగులు చల్లినట్టుగా భక్తులు రంగులు చల్లుకొని పులకించిపోయారు. వేడుక ఏర్పాట్లను ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, దేవస్థాన సలహాదారులు, గోదా గోష్ఠి బృందం, పర్యవేక్షించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు బండారి బాల్ రెడ్డి, శ్యామంతుల అనిల్, పబ్బ శ్రీనివాస్, తోట శ్రీనివాస్, సూర్యప్రకాష్, ఇంక్విలాబ్ టీవీ బుర్క రాకేష్, కట్టెల సాయి కుమార్, రేసు శంకర్ పాల్గొన్నారు.