రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇల్లంతకుంట మండలం గాలిపెళ్లి గ్రామానికి చెందిన అల్లెపు శ్రీనివాస్ అనే వ్యక్తి టాటా ఏసీ గూడ్స్ క్యారియర్ T/R no.TG 18 T/R 0951 అను నెంబరు గల వాహనంలో పదిరే వాగు నుంచి కామారెడ్డికి ఇసుక తరలిస్తున్నాడని ఎస్ఐ వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు బొప్పాపూర్ గ్రామం రాచర్ల కాలేజీ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఇసుకకు సంబంధించిన కాగితాలు లేనందున వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇసుక అక్రమ రవాణాకు బాధ్యుడైన శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.