హోలీ రోజు వీరంగం సృష్టించిన ఇద్దరు వ్యక్తులు. కోడిగుడ్ల కోసం సూపర్ మార్కెట్ యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇష్టనుసారంగా బూతులు తిడుతూ చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు. పోలీసుల కధనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గుండం జలపతి రెడ్డి, తండ్రి సుధాకర్ రెడ్డి అనునతను ఎల్లారెడ్డిపేటలోని దుమల గ్రామం వెళ్ళు దారిలో జిమార్ట్ సూపర్ మార్కెట్ నడుపుకొని జీవిస్తానని, తాను జిమార్ట్ షాప్ లో ఉండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన షాపులోకి గుండారం గ్రామానికి చెందిన నర్సింలు డేవిడ్ ఇద్దరు బీరు సీసాతో షాపులోకి వచ్చి కోడిగుడ్లు కావాలని అడగగా తాను కోడిగుడ్లు లేవని తెలుపగా, ఇద్దరు కలిసి ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టి బీరు సీసాలతో బెదిరిస్తూ అక్కడే ఉన్న పూల తొట్టి తనపై ఎత్తివేసి చేతులతో కొట్టి చంపుతామని బెదిరించినారని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి కిషన్ రావు తెలిపారు.