Monday, October 7, 2024
spot_img
HomeTELANGANAజిల్లాలో 30 పోలీసు యాక్ట్ 1861అమలు: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

జిల్లాలో 30 పోలీసు యాక్ట్ 1861అమలు: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతతను పెంపొందించేందుకు 01 మార్చ్ 2024 నుండి 31 మార్చ్ 2024 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 30 పోలీస్ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం గుమిగూడటం వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట, ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధము. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అగుదురని ఎస్పి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments