కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నదిలో సోమవారం గల్లంతైన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిలు నదిమాబాద్‌కి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. వీరంతా స్నానం చేసేందుకు నదిలోకి దిగినట్లు సమాచారం గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గల్లంతైన యువకుల మృతదేహాలు నాలుగు లభ్యం అయ్యాయని పోలీసులు తెలిపారు. దీంతో జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం ఏర్పడింది.