కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండల సమీపంలో అగర్ గూడ అడవుల్లో ఎలుగు బంటి మృతి చెందింది. గురువారం కళేబరాన్ని గుర్తించిన అధికారులు పశు వైద్యుల సమక్షంలో పంచనామా చేశారు. ఎలుగు బండి పై దాడి చేసినట్లుగా గాయాల ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు. ఎవరైనా ఆత్మరక్షణలో భాగంగా చంపేశారా, ఉచ్చులు పెట్టారా లేక విద్యుత్తు షాక్ తో హతమర్చారా అనే విషయం గురించి అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలుగుబంటి శరీర భాగాలను పంపినట్లుగా తెలిసింది. ఎలుగు ఆరు సంవత్సరాలు ఉన్నట్లుగా పశు వైద్యులు నిర్ధారించారు.