రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గురువు గారు రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు స్వామివారి దర్శనం కొరకై పాదయాత్రగా బయలుదేరిన గీత మందిరం భక్తులు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుంటామన్నారు భక్తులు.