రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఊరడి మహేష్ అనే వ్యక్తి ట్రక్కు కిందపడి దుర్మరణం చెందాడు. ఊరడి వరస్వామి కుమారుడు మహేష్ గొల్లపల్లి లోని తన ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న ట్రక్కు కిందపడి మహేష్ యొక్క తల పగిలి నుజ్జు నుజ్జు అయి మెదడు చితికి బయటపడ్డది. మృతునికి భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు (కూతురు, కుమారుడు) ఉన్నారు. సంఘటన స్థలానికి మృతుని భార్య కుటుంబ సభ్యులు చేరుకొని బోరుణ విలపిస్తున్నారు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, సంఘటన స్థలానికి సిఐ శ్రీనివాస్ గౌడ్ చేరుకొని జరిగిన ఘటనను పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు