Monday, May 20, 2024
spot_img
HomeTELANGANAఅధికార మదంతో మతోన్మాదం తలకెక్కి ముస్లిం మహిళ పై దాడి చేసిన ఎస్సై

అధికార మదంతో మతోన్మాదం తలకెక్కి ముస్లిం మహిళ పై దాడి చేసిన ఎస్సై

ఇతను జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్. భార్య ముందు హీరో కాబోయి ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యి ఇప్పుడు జీరో అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా కుల,మత, జాతులకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షిస్తామని, శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరాక, వాటన్నిటిని గాలికొదిలేసి, రక్షించాల్సిన ప్రజలపై వీధి గూండాలాగా దాడిచేసిన ప్రబుద్దుడు ఈ ఎస్సై అనిల్. ఇప్పుడు తానూ చేసిన పనికి సస్పెండ్ అయినా సంఘటన పూర్వాపరాలు ఇప్పుడు మీ ముందుకు.

నిన్న మధ్యాహ్నం బెజ్జంకి నుండి 22 సం.ల, MBA విద్యార్థిని షేక్. ఫర్హా అనే ముస్లిం అమ్మాయి, ఆమె తల్లి ఆర్టీసీ బస్సులో జగిత్యాలకి వస్తున్నారు. కరీనంనగర్ లో ఒక మహిళ బస్సులోకి ఎక్కింది. తను కూడా జగిత్యాలకు వస్తుంది. షేక్ ఫర్హా, తన తల్లి ఇద్దరు కూర్చున్న సీటు వద్ద వెళ్లి ఖాళీగా ఉన్న మూడవ సీటులో కూర్చుంది. పదేపదే మరికొంత జరగమని అనడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఒకరికొకరు మాటలు అనుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ వెనకి సీటులోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వాళ్ల సీటు దగ్గరికి వచ్చి కూర్చుని, నా భర్త ఏస్సై. నేను నా భర్తకు ఫోన్ చేశాను. అతను వచ్చి మీ సంగతి చూస్తాడు అని బెదిరించింది. వారు జగిత్యాల బస్టాండులో దిగినంక మాట్లాడుకుందాం అని అన్నారు.

బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే సీనీ ఫక్కీలో సివిల్ డ్రెస్సులో ఉన్న ఏస్సై అనీల్ కారుతో బస్సును అడ్డగించి బస్సు ఆపాడు. అప్పుడు ఎస్సై అనిల్ తో పాటు డ్యూటీ డ్రెస్ లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. బస్సులో ఎక్కిన ఎస్సై అనిల్ తన భార్యతో ఏవరు నీతో గొడవ పెట్టుకున్నవారని అసభ్యంగా మాట్లాడాడు. తన భార్య షేక్ ఫర్హా, ఆమె తల్లిని చూపించడంతో వారి దగ్గరికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ తీవ్రంగా బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడ్డ ముస్లిం అమ్మాయి తన ఫోన్ లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్ నెంబర్ కి పెట్టింది. వీడియా రికార్డ్ చేస్తుండటంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిన అనీల్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని జుట్టుపట్టి బస్సు నుండి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. అదే సమయంలో అనీల్ భార్య ఆ ముస్లిం యువతి తల్లి మీద చేయిచేసుకుంది. బస్సులో ఉన్న అంతమంది జనం ఆ తలలోకి కూతుళ్లపై జరుగుతున్నా దాడిని చూస్తున్నారే కానీ ఏవరూ ఆపే ప్రయత్నం చెయ్యలేదు. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అనీల్ ని నిలదీయడంతో ఆ అమ్మాయి పగిలిన ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని ఎస్సై అనిల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. జగిత్యాల టౌన్ పోలీసు స్టేషనులో బాధితులు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి 12 గంటల వరకు వారు పోలీసు స్టేషను దగ్గర ఉన్నారు. నిన్న జరిగిన సంఘటనకు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు గాని పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులు ఏస్సై అనీల్, కానిస్టేబుల్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విస్వసనియ సమాచారం. అలాంటివి ఏమైనా జరుగుతె ఊరుకునేది లేదని ఫర్హ పక్షాన ముస్లిం సమాజం నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కొడిమ్యాల వద్ద ముస్లిం సంఘాలు రాస్తారోకో నిర్వహిచారు. అదే సమయంలో కొండగట్టు పర్యటన నిమిత్తం వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయం తెలుసుకొని ముస్లిం పెద్దలను కలవడంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కవితను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కవిత మీకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ ఈ సంఘటనపై స్పందిస్తూ దాడికి కారుకురాలైన ఎస్సై అనిల్ భార్య తో సహా, ఎసై అనిల్ అతనితో బాటు వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లపై హత్యాప్రయత్నం కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సంఘాలు ముస్లిం సంఘాలు స్పందిస్తూ ఇలాంటి హేయమైన సంఘటనకు కారకుడైన ఎస్సై అనిల్ మీద ప్రభుత్వం, పోలీస్ శాఖా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఏస్సై అనీల్, కానిస్టేబుల్ ఇద్దరి పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటూ వెంటనే సర్వీసు నుండి తొలగించాలని ఈ సంఘటనపై జగిత్యాల జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందన్నారు సంఘం వ్యవస్థపై అధ్యక్షుడు షేక్ ఇమామ్ పాషా, ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలీ భాయ్

బుధ్గవారం రాత్రికి జగిత్యాల ఎస్పీ సదరు ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పుడు కొన్ని విషయాలను చర్చిద్దాం

పోలీసులకు ఒక మహిళ మీద చేయి చేసుకునే అధికారం ఏవరిచ్చారు… ? ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం నిందితులను కూడా పోలీస్ అధికారులు కొట్టకూడదు. అలాంటిది ఒక మహిళను పురుష అధికారి మతం పేరుతో దూషిస్తూ ఆమెపై అత్యంత దారుణమైన రీతిలో దాడి చెయ్యడం అదీ పట్టపగలు పదిమంది చూస్తుండగా దీనిని ఏ విధంగా చూడాలి అధికార మదంతో మతోన్మాదంతో ఒక వర్గం పై విషాన్ని తలకెక్కించుకున్న ప్రభుత్వాధికారి అధికార దుర్వినియోగంగా చూడాలా లేక ప్రజల్లో విద్వేషాలను సామాన్యుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు పాకించి తమ రాజకీయ లబ్దిని పొందే రాజకీయ నాయకుల విద్వేష క్రీడగా అనుకోవాలా. నేడు సస్పెండ్ అయినా ఈ అధికారి రెండు మూడు నెలల తర్వాత మరల విధుల్లో చేరాక ఇంతకు మించి ఒక వర్గ ప్రజలపై తన విద్వేషాన్ని చూపించడని నమ్మకం ఏముంది. రాగ ద్వేషాలకు, కులమతాలకు అతీతంగా రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వహించవలసిన ప్రభుత్వాధికారులు ఒక వర్గం ప్రజలపై ద్వేషపూరితంగా ఉంటె ఆ వర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నా ఈ విద్వేష కీడ ప్రశాంతమైన తెలంగాణా రాష్ట్రంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

బహిరంగంగా ముస్లింలపై విషం గక్కుతున్న ఒక జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీగా ఉన్న చోట ఈ సంఘటన జరగడం అత్యంత సున్నితమైన విషయం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎస్సై అనిల్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలి. అప్పుడు ఇలా మత విద్వేషంతో ఉన్న ఇతర ప్రభుతాధికారులకు గుణపాఠం చెప్పినట్లు అవుతుంది.

ముస్లిం సంఘాలు ఫెరా సంఘటనపై వెంటనే స్పందించడం చాల సంతోషకరం. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్పందనే ముస్లిం సంఘాలు, ముస్లిం రాజకీయనాయకులు వారు ఏ పార్టీలో ఉన్న కూడా ముస్లింల సమస్యలపై స్పందిస్తే ముస్లిం సమాజం కాస్త ధైర్యంగా ఉంటుంది ఇప్పుడిప్పుడే చైత్యన్యవంతమై విద్యను తమ ఎదుగుదలకు ఆలంబనగా భావించి తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకుంటున్న ఫరా లాంటి ముస్లిం యువతులు వారిని చదువులవైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లితండ్రులు మరో అడుగు ముందుకు వెయ్యగలుగుతారు. ఎన్నో సామాజిక కట్టుబాట్లను దాటుకుని ధైర్యంగా ముందడుగు వేస్తున్న ముస్లిం మహిళలు యువతులకు అండగా ముస్లిం మేధావులు సామాజిక కార్యకర్తలు రాజకీయ నాయకులూ మేమున్నాం మీకు అనే భరోసా కల్పిస్తే భవిష్యత్తు తరం ఉజ్వలంగా ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments