దుబాయ్: ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వారం రోజులుగా టాప్‌లో కొనసాగుతున్న టీమిండియా స్టార్ అశ్విన్ రవిచంద్రన్.. ఇప్పుడు ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆసీస్‌తో మూడో టెస్టులో కేవలం నాలుగు వికెట్లకే పరిమితమైన అశ్విన్ ఆరు ర్యాంకింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో ఆండర్సన్, అశ్విన్ చెరో 859 పాయింట్లతో నెంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. కమిన్స్ 3, రబాడ 4, షహీన్‌షా అఫ్రీది 5వ స్థానాల్లో ఉన్నారు.