రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెద్దురు గ్రామానికి చెందిన భగత్ కిడ్నీ సంబంధిత వ్యాధితో సంవత్సర కాలంగా బాధపడుతూ ఓ యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి చికిత్స పొందుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. పెద్దూరు గ్రామానికి చెందిన బడుగు బగత్ తన అమ్మమ్మ స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట లో ఏర్పుల ఎల్లవ్వ గాలయ్య వద్ద ఉండి విద్యాభ్యాసం చేశాడు. గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అంతలోనే కిడ్నీ వ్యాధికి గురై చికిత్స పొందుతూ చనిపోయాడు. భగత్ మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.