బోయినిపల్లి మండల కేంద్రంలోని వేములవాడ రోడ్డులో పెట్రోల్ బంకు ముందు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గంగాధర మండలం పిట్టలపల్లి గ్రామానికి చెందిన గోధలా కమలాకర్ అనే వ్యక్తి తల పగిలి మెదడు పూర్తిగా బయటకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, అయితే మృతుడు వేములవాడలోని కోర్టులో ఫెషీ ఉండటంతో హాజరు కావడానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నట్లు సమాచారం. ఘటన స్థలం వద్ద మృతుని కుటుంబ సభ్యులు రోధించిన తీరు ఎంతోమందిని కలిసి వేసింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు..కాగా ప్రమాదానికి కారమైన లారీ డ్రైవర్ లారీ తో పాటు పరార్ అయ్యాడు