నటసింహ నందమూరి బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో సంవత్సర కాలం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. డైలాగ్స్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని.. నటి జయప్రదకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అందించబోతున్నారు.