మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ కేటీఆర్ కు ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లీ బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని తీన్మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గం మాజీ కో కన్వీనర్ మహమ్మద్ అంకుస్ హెచ్చరించారు. శనివారం జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుడు రాజకీయాలు చేయొద్దా..? మీ దృష్టిలో గవర్నమెంట్ పాఠశాలలు కళాశాలలో చదువుకున్న వారు పల్లీ బఠానీలు. అమ్ముకోవడానికి పనికొస్తారని మీ ఉద్దేశమా…? ప్రభుత్వ సంస్థలలో చదువుకున్నవారు పల్లీ బఠానీలు. అమ్ముకోవాలి, బిట్స్ పిలానీలో చదివినవారు రాజకీయాలు చేయాల అంతేనా… ఇది మీ దొర అహంకారానికి ప్రతిరూపంగా చెప్పొచ్చు.
2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపినప్పటికీ మీ బలుపు మాత్రం అనగడం లేదు. అనే విషయాన్ని మీ మాటల ద్వారా అగుపిస్తుంది. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజలను గౌరవించడం నేర్చుకుంటే భవిష్యత్తులో మీ పార్టీ కనీసం ప్రతిపక్ష స్థానంలోనైనా ఉంటుంది లేనట్లయితే ఇవే బలుపు మాటలు కొనసాగినట్లయితే కాలగర్భంలో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలారా విజ్ఞానవంతులైన పట్టభద్రులారా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దోపిడి 10 సంవత్సరాల్లో తెలంగాణను సర్వనాశనం చేసి ఇవాళ సుద్ధపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ నష్టపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైనట్టుగా ప్రజలను మభ్యపెడుతూ ఇంకా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారో కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని, వేయి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యక్షేత్రాలు తిరిగినట్టు వేల ఎకరాలు, లక్షల కోట్ల ధనాన్ని దోచుకుని ఫామ్ హౌస్ లు కట్టుకొని, తెలంగాణను సర్వనాశనం చేసి నిరుద్యోగులను రోడ్డున పడేసి ఇవ్వాలా ఏమీ తెలియనట్టు పత్తిత్తు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని, పట్టభద్రులారా టి ఆర్ ఎస్ నాయకులను నమ్మి మోసపోకండి ప్రజా గొంతుకయిన తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని తీన్మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గ మాజీ కో- కన్వీనర్ ఒక ప్రకటనలో వేడుకున్నారు…