కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డు జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డితో, ఉన్నతాధికారులతో మాట్లాడి 5.9 MGD ఉన్న నీటి సరఫరాను 1 MGD పెంచి 6.9 MGD చేయించానని ఆ నీరు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా లేకపోవడంతో ఇటీవల వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి ను స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు ఉన్నారు.

