Wednesday, January 22, 2025
spot_img
HomeTELANGANAభూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: పూదరి రేణుక శివకుమార్ గౌడ్.

భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: పూదరి రేణుక శివకుమార్ గౌడ్.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి బాధితుల ఫిర్యాదు మేరకు భూకబ్జాదారులపై పెడుతున్న కేసులు అభినందనీయమని ఇలాంటి ఆఫీసర్లు ఎప్పుడో ఒకసారి వస్తారని వారు చేస్తున్న పనితో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగిందని జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మోహంతి తాను సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాదారులు చేస్తున్న కబ్జా దందాలపై ఉక్కు పాదం మోపడమే కాకుండా అమాయకులైన ఎంతోమంది బాధిత కుటుంబాలకు అండగా మేము ఉన్నామంటూ భరోసా కల్పించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

సిపి కరీంనగర్ లో చేస్తున్న విధంగానే జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై విచారణ చేపట్టి ఎంతోమంది బాధితులు తమ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకొని బెదిరింపులకు భయపెట్టి వారి భూములను లాక్కున్నారని అలా నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వారు కోరారు. అప్పటి ప్రభుత్వంలో నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది బడా నేతలు వారికి అనుకూలంగా పనిచేసిన అధికారుల అండదండలతో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 629, 887లో కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని అనర్హులు ఆక్రమించుకొని తమ ఇష్టారాజ్యంగా అమ్ముకోవడమే కాకుండా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఎవరైనా దళితులు బీదవారు ఆ స్థలం మాది అని అడిగితే వారిపై దౌర్జన్యాలకు దిగడం వీలైతే కేసులు పెట్టడం ఎదురు తిరిగితే బెదిరించడం లాంటి సంఘటనలు ఉన్నాయని సిపి ఈ విషయాలపై దృష్టి సారించి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కోట్లకు పరిగెత్తిన వారు కొందరైతే అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయల భూమిని కబ్జాలు చేసుకొని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి కోట్లకు పడగలెత్తిన ఉద్యోగులు కూడా ఉన్నారని ఆమె అన్నారు. అప్పటి నాయకులు అండదండతో కొంతమంది అధికారులు లంచాలు తీసుకొని ఎంతో మంది పేదవారికి కనీసం 60 గజాల భూమి లేకుండా చేశారని నిజమైన అర్హులు రోడ్లపై ఉంటే అనరులు బంగ్లాలలో ఉంటున్నారని ఈ సర్వే నెంబర్ లపై అధికారులు సర్వేజరిపి నిజాలా నిగ్గు తెలిస్తే సంచలన నిర్ణయాలు బయటకు వస్తాయని ఇంకా కొంతమంది నాయకుల బెదిరింపులతో బాధితులు పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా ఆర్టిఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని ఎవరైనా ఆర్టిఐ పెడితే వారిని బెదిరించడం లేక డబ్బులతో లొంగదీసుకోవడం జరుగుతుందని వెంటనే సి పి ఈ విషయంపై దృష్టి సారించి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments