రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కోనేటి దేవవ్వ (60) భర్త కీశే కోనేటి మల్లేశం ఈ మద్య కాలంలో దురదృష్టవశాత్తూ అనారోగ్యం కారణంగా మరణించగా ఇంటిని పోషించే పెద్ద దిక్కు కోల్పోవటంతో నడవలేని స్థితిలో ఉన్న దేవవ్వ పరిస్థితి అమ్మ ఫౌండేషన్ చెర్మన్ ఆకుల మురళీమోహన్ కు తెలియడంతో తనవంతు సహాయంగా ఆసరాగా 50 కిలోల క్వాలిటీ BPT బియ్యం సహాయం అందించారు. నడవలేని దేవమ్మకు వృద్ధాప్య పింఛన్ వచ్చేలా చూస్తా అనీ హామీ ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం అందించే మంచి మనసు ఉన్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎల్లారెడ్డిపేట భారత రాష్ట్ర సమితి మండల ఉపాధ్యక్షులు ఆకుల మురళీమోహన్ గౌడ్ కు ధన్యవాదములు చెప్పారు దేవవ్వ. ఈ కార్యక్రమంలో ఆకుల సాగర్, కొండ సాయి, ముద్రకోలా కృష్ణ, స్థానికులు పాల్గొన్నారు