కామారెడ్డి జిల్లా బేబీ పేట్ కు చెందిన ఎంపీటీసీ కోరివి నీరజా ఆమె భర్త నర్సింలు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం చాలా పనులపై ఆంక్షలు విధించారని ఒత్తిడికి లోనైనా అభివృద్ధి చేయడంలో ముందంజలోకి వెళ్లాలంటే బిఆర్ఎస్ పార్టీలో చేరాలని హుకుం జారీ చేశారని బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినంక కొత్త పాత పేరుతో ఎంపీటీసీలను సైతం విలువ లేని రాజకీయాల్లో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారినందుకు తగిన శాస్త్రి చేశారని లోలోపల కుమిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన ముదిరాజ్ వార్డులో కొన్ని పనులు మాత్రమే చేశానని బోర్లు వేయించడానికి మండల సర్వసభ్య సమావేశంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాధుడు కరువైయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీపీ కంటే మండల పరిషత్ కార్యాలయంలో సీటు లేని మండలాన్ని తీర్చిదిద్దామంటే అన్ని అడ్డంకులు ఎదురైనందున మండల ప్రజలు ఇలాంటి అభిప్రాయం తీసుకోమని నిర్ణయం చేస్తే దానికి నిలబడి ఉంటానని ప్రజలతో చర్చించి అలాగే నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కరిస్తూ అభివృద్ధికి ఎంతో కొంత మేలు చేశాను చాలా చేద్దామని ముందుకు వెళితే ముదిరాజ్ సోదరులు కుల బాంధవులు నాకు ఈ రోజు ఈ స్థానం ఉన్నదంటే మా కులం సహకరించడం వల్లేనని కూరగాయలు అమ్మే తనని మా ముదిరాజ్ సోదరులు నువ్వు ఎంపీటీసీగా గెలవాలని మంచి గుర్తింపు ఇచ్చినందుకు ముదిరాజ్ సోదరులకు కుల బంధువులకు అందరికీ పేరుపేరునా నా నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఎన్ని చేసినా తక్కువేనన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు నన్ను గెలిపించిన ప్రతి ఒక్క కులానికి మీడియా ముఖంగా పేరుపేరునా మన్నించాలని ప్రజలే గొప్ప అని ప్రజల తీర్పుకు లోబడి ఉంటానని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెబుతున్నానన్నారు. మా ఒకటో వార్డులో ముదిరాజ్ వాడ, రామ్ రెడ్డి పల్లి గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇతర నియోజకవర్గాలకు పనులు చేయించారని ఆరోపించారు. పనులు పూర్తి చేయాలంటే పై అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించవలసింది పోయి పూర్తిస్థాయిలో పనులు చేయకుండా అభివృద్ధి కుంటుపడే విధంగా చేశారని నీరజ ఆరోపించారు. ఎంపిటిసి పరిధిలోని గ్రామాలలో ఊరు గొప్ప అభివృద్ధి దిబ్బగా మారిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రెండు ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయడంలో ముందుకు రాలేదని బాధపడ్డారు. ఇకనైనా అధికారులతో పాటు ఎమ్మెల్యే, ప్రజా పాలన యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారని నర్సింలు అన్నారు. నాకు బిజెపి టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఆయా పార్టీలలో చేరెందుకు తన అనుచరులతో పాటు కుల పెద్దలు, గ్రామస్థులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటామని నీరజ, నర్సింలు అన్నారు