కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ ఒకటో వార్డ్ ఇంటి నుండి వాగుకు, పొలాలకు పోయే రోడ్డు అధ్వాన్నంగా బురదగా మారిందని గ్రామస్థులు వాపోయారు. ప్రతిరోజూ బురద రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ రోడ్డు గుండా నిత్యం 200 మంది రైతులు ఎడ్ల బండ్లతో వెళుతారని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు స్పందించి గ్రామస్థులకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌరవ అధ్యక్షులు గంగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముంజం వినోద్ కుమార్, సాయి, సాగర్, దత్తెశ్వర్, ఇస్తరి, తాజా మాజీ వార్డ్ సభ్యురాలు మదన్ కమలబాయి గ్రామస్థులు కోరుతున్నారు.

