దేవరకొండ, డిసెంబరు 31: దేవరకొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రాజెక్టులను పూర్తి చే సి సాగు, తాగునీటిని అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే నే నావత బాలునాయక్ అన్నారు. దేవరకొండలో ఆదివారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల ను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రు గ్యారంటీ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తుందని అ న్నారు. నియోజకవర్గ ప్రజలు పథకాలను సద్వినియోగం చే సుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి పెట్టారని తెలిపారు. సీఎం రేవంతరెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చే స్తానని అన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు నూత న సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ ప థకాలను పూర్తి స్థా యిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు జాల నర్సింహారెడ్డి, ముక్కమాల వెంకటయ్యగౌడ్, ఆలంపల్లి నర్సింహ పాల్గొన్నారు.
అంగనవాడీలకు అండగా ఉంటా
అంగనవాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని, వారికి ఎప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలునాయక్ పేర్కొన్నారు. దేవరకొండలో ఆదివారం అంగనవాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన దేవరకొండ ప్రాజెక్టు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలునాయక్‌ను ఘనంగా స న్మానించారు. అనంతరం సమస్యలతో కూడిన పత్రాన్ని అం దజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప ల్లా నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి, అంగనవాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు వ నం రాధిక, నాయకులు అరుణ, శాంతబాయి, అంగనవాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలి
కొండమల్లేపల్లి: ప్రభుత్వ అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఎంపీపీ రేఖ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వస భ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మిషన భ గీరథ పథకం మంచినీరు ఇప్పటికీ మండలంలోని కొన్ని గ్రా మాల్లో అందడం లేదని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు స భ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బా లునాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలికంగా నెలకొ న్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న వేసవికాలంలో మిషన భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉం డి నీటిసరఫరా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యా రంటీ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్హులందరికీ పార్టీలకతీతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో గంజాయి, గుట్కాపై ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారైనా చర్యలు తీ సుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. సమావేశంలో అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.