‘‘వివేకానందరెడ్డి హత్యపై అన్ని అధారాలతో టీడీపీ విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంతో ప్రజలకు జగన్ క్రూరత్వం తెలిసిపోయింది. అందుకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది’’ అని జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వివేకా హత్య కేసులో సూత్రధారి తాడేపల్లి ప్యాలె్‌సలో ఉంటే.. ప్రధాన పాత్రధారులు ఎంపీ అవినాశ్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులని ప్రజలకు తెలిసిపోయింది. ఇన్నాళ్లు ఆస్కార్ స్థాయికి మించి నటించారు. తీగలాగితే డొంక కదలింది. సీబీఐ అవినాశ్‌రెడ్డిని విచారించగానే తాడేపల్లి గుట్టు అంతా బయటపడింది. వాస్తవాలు బయటకు రావడంతో పిచ్చి కుక్కల్ని మీడియా ముందుకు వదిలి మాట్లాడిస్తున్నారు. ఎన్ని కుక్కల్ని వదలినా, సొంత పేపర్లో ఎన్ని తప్పుడు రాతలు రాసినా నిజాన్ని చెరపలేరు.
పేర్ని నానికి నాలుగు బిస్కెట్లు వేయగానే తోక ఊపుకుంటూ వచ్చి, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ చదివి వెళ్లాడు. పేర్ని నానికి పుట్టుకతోనే బుర్ర లేదు అని వ్యాఖ్యానించారు. వివేకా హత్యలో ప్రధాన పాత్రధారులు అవినాశ్‌రెడ్డి, అతని బంధువర్గమైతే, సూత్రధారి జగన్‌రెడ్డి.. ఇది కాదనలేని నిజం. గుట్టు అంతా బయటపడినా ఇంకా అవినాశ్‌రెడ్డి అమాయకుడైనట్టు వైసీపీ నేతల చేత జగన్‌రెడ్డి మాట్లాడించడం సిగ్గుచేటు. వివేకా హత్యా ఘటన సమాచారమంతా మినిట్ టూ మినిట్ అవినాశ్‌రెడ్డికి తెలుసు. అర్ధరాత్రి తన అనుచరులకు, తాడేపల్లి ప్యాలె్‌సకు టచ్‌లో ఉండి ఈ కిరాతకానికి ఒడిగట్టారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణతో ఇంకా అన్ని నిజాలు ప్రజలకు తెలుస్తాయి’’ అని పట్టాభి స్పష్టం చేశారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలు… కాల్వ శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసులరెడ్డి, ఎన్ అమర్నాథ్‌రెడ్డి, బీటెక్ రవి, బీసీ జనార్దన్‌రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు… సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. పుస్తకంలో లేవనెత్తిన పలు ప్రశ్నలకు నేరుగా సీఎం జగన్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పుస్తకంలోని అంశాలను వక్రీకరిస్తూ జగన్ మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో అంటూ జగన్‌కు రాసిన ఆ బహిరంగ లేఖలో వివరించారు. తాడేపల్లి ప్యాలె్‌సపై వస్తున్న ఆరోపణలకు జగన్‌రెడ్డి దంపతులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.