రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక పాత బస్టాండ్ ఎల్లారెడ్డిపేటలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ లో 16 కులాలకు సంబంధించిన వివిధ రకాల కార్పొరేషన్లు, మరియు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, జిల్లా కార్యదర్శి రంగా గిరిధర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు ఆకుల లత, రఫిక్, గోపాల్ మహేందర్, తిరుపతి గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంట అంజయ్య గౌడ్ రాములు, ఇమామ్ బాయ్, దండు శ్రీనివాస్, అక్కపెల్లి లక్ష్మారెడ్డి, బండారి, బాల్రెడ్డి, ఏలూరి రాజయ్య, గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.