తెలుగు సినిమాకి ఇంతకు ముందు ఎప్పుడూ రానటువంటి వైభవాన్ని దర్శకధీరుడు రాజమౌళి తీసుకువచ్చారు. ఆయన రూపొందించిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ప్రపంచానికి తెలుగు సినిమా ఏంటో తెలియజేశాయి. ఇప్పుడు మరో సరికొత్త రికార్డుకు ‘ఆర్ఆర్ఆర్’ చేరువలో ఉంది. దీని కోసం రాజమౌళి అండ్ టీమ్ కొన్ని రోజులుగా అమెరికాలో ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో తెలియంది కాదు. కానీ.. దీనిని కూడా కొందరు కమర్షియల్‌గా ఆలోచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్స్ నామినేషన్‌కు ఎంపికైంది. ఇంకో రెండు రోజులలో తెలుగు సినిమా స్టామినా ఏంటో.. అమెరికా స్టేజ్‌పై కనిపించనుంది. నిజంగా ఇది.. ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన క్షణమిది. అలాంటిది.. కొందరు లేనిపోని కామెంట్స్ చేసి వార్తలలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా… ఈ ఆస్కార్స్ పబ్లిసిటీ కోసం పెట్టిన పెట్టుబడితో 8 సినిమాలు చేసి ముఖాన కొడతామని కొందరు.. రూ. 80 కోట్లకు పైగా దీనికి ఖర్చు చేయడం అవసరమా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో, మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్స్ చేస్తున్న వారందరికీ వైసీపీ (YCP) వారి భాషలో నా సమాధానం.. అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
“నీ** **డు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం’’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌కు నెటిజన్లు కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. కరెక్ట్ టైమ్‌లో పర్ఫెక్ట్ షాట్ అన్నట్లుగా నెటిజన్లు నాగబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతకాలంగా ప్రపంచ సినిమా పటంపై తెలుగు సినిమా రారాజుగా వెలుగొందుతుందంటే అందుకు కారణం ‘RRR’. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయి.. గంటలు గంటలు ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్‌తో మాట్లాడుతుంటే.. ఇక్కడ మాత్రం కొందరు చీప్‌గా మాట్లాడటం ఏమిటో వారికే తెలియాలి. అందులోనూ సినిమా మేకర్స్ అయిన వాళ్లు కూడా మాట్లాడటం విడ్డూరమనే చెప్పుకోవాలి. అలాంటి వారందరికీ అన్నట్లుగా.. ఈ సమాధానం ఉందనేలా నెటిజన్లు నాగబాబు ట్వీట్‌పై రియాక్ట్ అవుతున్నారు.