అక్కడికక్కడే ముగ్గురు యువకుల దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో గురువారం రాత్రి 11 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది, బెజ్జూరు మండలంలోని పోట్సాపల్లి – కొరత గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో అరక గూడా గ్రామానికి చెందిన ఆత్రం మహేష్, తుర్రం వెంగయ్య, ఎలుక పల్లి గ్రామానికి చెందిన దున్న నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు, ఎలకపల్లి నుండి పోతేపల్లి కి పెండ్లి డిన్నర్ కు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలియజేశారు, రోడ్డు ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.