ప్రపంచ క్రీడల్లో క్రికెట్ కు ప్రత్యేక స్థానం ఉన్నదని, చాలా మంది క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా .వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు యన్.జి.ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ చాటి ప్రశంస పత్రాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ యస్.జి.ఎఫ్ వారు పలు టోర్నమెంట్ల నిర్వహణ చూడడమే కాకుండా వారిని సరైన పద్దతిలో అమలుపర్చేలా పలు నియమ నిభందనలు ఏర్పాటు చేశారని మన మన రాష్ట్రంలో యస్.జి.ఎఫ్ వారు ఆదేశించిన ప్రకారం నిర్దేశించిన సమయంలో ఆడాలని, ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని సూచించారు.
పాఠశాల స్థాయిలో నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వారిని వివిధ స్థాయిలో నిర్వహించబడే పలు క్రీడా పోటీలకు ఎంపిక చేయడమే కాకుండా కావల్సిన సమయంతో పాటు ప్రోత్సాహం అందిస్తామని ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో యన్.జి.ఎఫ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాఠశాలకు చెందిన యన్.సుమేద్ (9వ తరగతి), యన్.ప్రధ్యుమ్న (8వ తరగతి) రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ప్రశంసా పత్రాలను సాధించారని హర్షం వ్యక్తం చేస్తు వారిరువురికి పుష్పగుచ్చాలందజేసి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు


