ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ కవయిత్రి కుమ్మరి (అతుకూరి) మొల్లమాంబ 584వ జయంతి వేడుకలు శాలివాహన సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. సంఘ సభ్యులు మాట్లాడుతు మొల్లమాంబ 16 వ శతాబ్దనికి చెందిన తెలుగు ఆడపడుచు కడప జిల్లా గోపవరంకు చెందిన మహిళ ఈవిడ రామాయణం 6 కాండములలో సుమారు 870 పీఠికతో కలిపి రచించిన గొప్ప మహిళగా గుర్తింపు పొందిందన్నారు. కుమ్మర్లు తమ కుల హక్కులను కాపాడుకోవాలని వారికంటూ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు రావాలని రాష్ట్రంలోని అన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేసారు మా కులానికి కూడా ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేసారు. లేనిచో కుమ్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా మా కుమ్మర్ల హక్కులను కాపాడుకోవడానికి రాస్తారోకో కూడా చేయటానికి వెనుకాడం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాలివాహన సంఘం అధ్యక్షుడు ఏదునూరి అంజయ్య, ఉపాధ్యక్షుడు ఎదునూరి దేవయ్య, క్యాషియర్ దరిపల్లి శంకర్, సలహాదారులు ఏదునూరి రాములు, ఐలపురం లక్ష్మయ్య, శాలివాహన యువజన అధ్యక్షుడు ఏదునూరి భానుచందర్, ఉపాధ్యక్షుడు ఏదునూరి గోపికృష్ణ, క్యాషియర్ దరిపెల్లి వెంకటేష్, సలహాదారులు ఎదునూరి శ్రీకాంత్, ఐలాపురం నరేష్, ఐలాపురం సంజీవ్, ఎదునూరి అశోక్, ఏదునూరి అఖిల్, ధర్పల్లి పరశురాములు, లచ్చయ్య, దరిపెల్లి కిషన్ దరిపెల్లి లింగం, గూడూరు మల్లయ్య, ఎదునూరి రామచంద్రం, ఎదునూరి శంకర్, ఏదునూరి రాములు, ఐలపురం కాశయ్య, ఎదునూరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.