Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఅర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ

అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ

ఆదివారం నాడు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ధర్మారంలో బొంగోని వీరన్న & మారపల్లి బిక్షపతి,ఆధ్వర్యంలో ఒకటో వార్డు, రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను నిరుపేద కుటుంబ లబ్ధిదారులకు స్వయంగా వారి ప్రస్తుత నివాస ప్రాంతాలకు వెళ్లి అందజేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ వోడతల ప్రణవ్ బాబు మంజూరైన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించి మీరందరూ త్వరగా ఇల్లు కట్టుకోవాలని కోరారు. పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలే చెప్పింది గాని చేతుల్లో ఏ పని చేయలేదని ఒకసారి కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకుంటుందని ఇవాళ ఇందిరమ్మ ఇళ్లయితేనేమి కొత్త రేషన్ కార్డులు అయితేనేమి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితేనేమి నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అయితేనేమి ఫ్రీ బస్సు అయితేనేమి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమని మీరంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశిని కోటి, పొన్నగంటి మల్లయ్య,.ఎర్రం సతీష్ రెడ్డి, సుంకరి రమేష్,.సాయిని రవి,.గూడెపు సారంగపాణి, మొలుగురి సదయ్య, రేణుక, తాజా మాజీ కౌన్సిలర్లు మేడిపల్లి రవీందర్, ఎలగందుల సరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, దేశిని రాధా సదానందం, దిడ్డి.రామ్మోహన్, కుదాడి రాజయ్య, బిట్ల కళావతి మోహన్, జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, సూర్య, స్థానిక నాయకులు పాత సత్యం, ముద్దమల్ల రవి, ఎండి సలీం, పోతుల శ్రీనివాస్, లింగారావు, సదానందం, అజయ్, అనిల్, రవి, విష్ణు, యూత్ కాంగ్రెస్ నాయకులు పర్లపెల్లి నాగరాజు, md సజ్జు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments