30 సంవత్సరాలుగా వర్గీకరణ సమయంలో ముందుండి మాదిగలు మాదిగలతో పాటు ఉపకులాలు అయినటువంటి 58 ఉపకులాలు, మాదిగలతో పాటు మాకు న్యాయం జరగాలని హక్కులు రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి కుటుంబానికి చెందాలని, చెందేలా న్యాయం చేయాలని 35 సంవత్సరాలుగా రోడ్లమీద ఎండనక వాననక రైలు రోకో, రాస్తారోకో, బస్సు రోకో లని,తెలంగాణ బంద్, ఆంధ్ర బంద్, ఢిల్లీ బంద్, జంతర్ మంతర్ అని అనేక రకాలుగా అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తున్న, కేంద్ర ప్రభుత్వాలు కేవలం మా ఓటు కోసం మమ్మల్ని వాడుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా వారి రాజకీయ పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మోసం చేస్తున్నారని వారన్నారు. కావున ఒకటి రెండు తేదీలలో ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ధర్నా చేయడానికి తెలంగాణలో ఉన్న మారుమూల పల్లెల నుండి ఢిల్లీకి మూడు వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చామని మా హక్కులు మాకు అందించాలని, మాకు న్యాయం జరగాలని నిరసన చేయడానికి వచ్చామన్నారు.
అయితే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని 2004లో కొట్టివేసిన వర్గీకరణను కొనసాగించవచ్చునని సమాచారం వచ్చిందని ఈ విషయానికి సంబంధించి బాధ్యత మొత్తం ప్రభుత్వాలదే అని అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆయన మాదిగలకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా హక్కులు కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే అని సుప్రీంకోర్టు నుండి ఏ తీర్పు వచ్చిందో ప్రభుత్వం వారు తీసుకొని మాదిగలకు ఏ రకంగా న్యాయం చేస్తారో ఆలోచించుకొని మాదిగలకు ఆయా రాష్ట్రాలలో వారి కుటుంబాలకు, కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు దండు సురేందర్, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సింహ, చింత శ్యామ్, రాష్ట్ర మహిళా కన్వీనర్ మామిడి శోభ, రాష్ట్ర లీగల్ సేల్ దరశనం రామకృష్ణ, రాష్ట్ర యువసేన అధ్యక్షులు గొల్లపల్లి నరేష్, రాష్ట్ర నాయకులు సిహెచ్ అశోక్, రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శాంతి కుమార్ ఎం ఎస్ యు, రాష్ట్ర నాయకులు కాలేశ్వరపు సాల్మన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల కుమార్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్, ఆయా జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…