బుధవారం కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ సత్య సాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు MH ఇనాయతుల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోని సూపర్ సిక్స్ పథకాల హామీలు వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు రూ.20వేలు ఇస్తాం, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం, ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ ఇస్తాం అన్నారు. ఈనాటికి విధివిధానాలు తయారు చేయలేదన్నారు. మహిళలకు మహాశక్తి పథకం కింద ప్రతి నెల రూ.1500 లు అన్నారు. ఇప్పటికీ దీని గురించి ప్రస్తావన లేదని నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని మోసం చేశారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేదంటే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కదిరి కాంగ్రెస్ నాయకుల చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మన రాష్ట్రంలో మాత్రం అమలు చేయడం లేదని ప్రతి నెల కేవలం రూ.350 కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి కూడా 9 నెలలుగా దిక్కులేదని సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అని ప్రశ్నిచారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు.
సూపర్ 6 పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలం: DCC అధ్యక్షులు MH ఇనాయతుల్లా
RELATED ARTICLES