రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో బుధవారం జిల్లాఎస్పీ అఖిల్ మహాహాజన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం వీర్నపల్లి మండలం వన్పల్లిలో జరిగిన హత్య సంఘటనను ఛేదించిన పోలీసులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యకు గల కారణాలను వివరించారు. హత్య జరిగిన సంఘటన నుండి సిడి హండ్రెడ్ బైక్, 2 సెల్ ఫోన్లు, మట్టెలు, వెండి పట్టగొలుసులు, రెండు ఏటీఎం కార్డులు, కత్తి, కొడవలి, 2500రూపాయల నగదు స్వాధీనం చేసుకొని హత్య చేసిన వ్యక్తులను విచారణ అనంతరం కోర్టుకు అప్పగించనున్నట్లు తెలియజేశారు. A1 వన్ గా మాది గాని రవీందర్ ను, A2 గా భూక్య మహేష్ ను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్, వీర్నపల్లి ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు..