Tuesday, December 16, 2025
spot_img
HomeANDHRA PRADESHప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక

ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశం సోమవారం సాయంత్రం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మానూరి గంగరాజు, ఆడారి శ్రీధర్, ఎండి అధికార్, ప్రతి శ్రీనివాసరావు, అధ్యక్షులుగా దాకారపు కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల సుబ్బు, ఉపాధ్యక్షులుగా ఎస్.మల్లిఖార్జునరావు, గునపర్తి అపురూప్, కోశాధికారిగా నక్కా నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా సామన గణేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దాడిశెట్టి అయ్యప్ప స్వామి, కార్యవర్గ సభ్యులుగా దాడిశెట్టి వీరబాబు, బోడసింగి నానాజీ, షేక్ సలీం, కీర్తి వివేక్, దాసరి కృపానందం, యనమల జ్యోతిబాబు, బూతుకూరి బాలకృష్ణ, తిరునగరి కృష్ణ, తాతాజీలని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అభినందించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి, కిర్లంపూడి మండలాల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments