రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పుస్తే, మట్టెలు బుధవారం వితరణ చేశారు, తన తల్లి దండ్రులు కీర్తి శేషులు నేవూరి లక్ష్మి, మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య పుష్ప దంపతుల కూతురు సౌందర్య కు పుసై మెట్టెలు వితరణ చేశారు, ఇప్పటి వరకు 1037 పుస్తె మట్టెలను నిరుపేద యువతుల పెళ్ళిలకు పంపిణీ చేశామని నేవూరి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పుసై మట్టెల వితరణ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఎదురుగట్ల ముత్తయ్య గౌడ్, మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, పరికి శ్రీనివాస్, అంకాశి రాజేష్, తదితరులు పాల్గొన్నారు,