రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణం లో వినాయక పండుగను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని నిమజ్జనం రోజు డీజే కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అన్ని మండపాల నిర్వాహకులు ఒకేరోజు నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి గంభీరావుపేట ఎస్సై లు పాల్గొన్నారు.