రాజన్న సిరిసిల్ల జిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ గురై మంటలుగా చెలరేగాయి అని నిర్వాహకులు తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పడికే కంప్యూటర్లు ఫర్నిచర్లు ధ్వంసం అయినవి సుమారు రెండు లక్షల పైగా నష్టం కలిగినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం రోజున ఈ సంఘటన జరగడంతో విద్యార్థులు ఎవరు కాలేజీ రాకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్టు అయింది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి జరిగిన నష్టం ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.
