Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సత్తు మల్లేశం

కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సత్తు మల్లేశం

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై అభినందించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం విజయ రమణారావు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ గా సత్తు మల్లేశం ఈరోజు జిల్లా కేంద్రంలోని గ్రంధాలయంలోని తన ఛాంబర్ లో వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సత్తు మల్లేశం మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణ, మేడిపల్లి సత్యం, విజయ రమణారావు లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిరాజ్ హుస్సేన్, వంగల విద్యాసాగర్, గంగుల దిలీప్ కుమార్, సిరిపురం లావణ్య, నాగప్రసాద్, కామ్రెడ్డి రాంరెడ్డి, సాయిని తిరుపతి, మాదాసు శ్రీనివాస్, రోళ్ళ సతీష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మంద మహేష్, ముద్దసాని రంగన్న, పెద్ది గారి తిరుపతి, బుర్ర హరీష్ గౌడ్, రూపు రెడ్డి శ్రీనివాసరెడ్డి, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments