రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీమరి దేవయ్య కుటుంబాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తన ఇంటి కి వెళ్లి పరామర్శించారు. ఆదివారం ఉదయం దేవయ్య తాటిచెట్టు ఎక్కి తాటి ముంజలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ జారీ కింద పడి దేవయ్య అక్కడికక్కడే మరణించారు
ఈ విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, వడ్నాల ఆంజనేయులు, జజ్జరి దేవేందర్, అబ్బనవేని భీమయ్య, ఆంజనేయులు, దండు శ్రీనివాస్ లు వారి ఇంటి కి వెళ్లి దేవయ్య మృతి బాద కరమని ప్రగాఢ సంతాపం తెలిపారు, అతని భార్య దేవవ్వను కుమారులు రాజు బాబులను పరామర్శించారు,