రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గల జయ ఆసుపత్రిలో ఆదివారం సిరిసిల్లకు చెందిన డాక్టర్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ ఏ మోహన్ కృష్ణ, ఎంఎస్, ఈఎన్టి వివిధ సమస్యలతో వచ్చిన రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. చెవి సమస్యలతో వచ్చిన వారికి ఉచితంగా వినికిడి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 41 మంది వైద్య సేవలు పొందారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ బాబు, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ దినేష్, లయన్ అనంతుల శివప్రసాద్ పాల్గొన్నారు.