రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవుని గుట్ట తండాలో ఆదివారం నూతనంగా జగదంబ దేవి సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టించారు ఈ కార్యక్రమానికి జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావుకు ఆలయ కమిటీ నిర్వాహకులు శాలువా కప్పి సత్కరించారు