Sunday, March 23, 2025
spot_img
HomeANDHRA PRADESHఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి బంధించేందుకు ప్రయత్నిస్తున్న అటవీశాఖ అధికారులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై దాడిచేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలుగుబంటి దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయంతో హడలిపోతున్నారు. గ్రామం విడిచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments