సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. అర్పిత్ వసవాడ (47 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పోరాడడంతో సెమీ్‌సలో సౌరాష్ట్ర 4 వికెట్లతో కర్ణాటకను ఓడించి ఐదోసారి తుది పోరుకు అర్హత సాధించింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. అర్పిత్ వసవాడ (47 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పోరాడడంతో సెమీ్‌సలో సౌరాష్ట్ర 4 వికెట్లతో కర్ణాటకను ఓడించి ఐదోసారి తుది పోరుకు అర్హత సాధించింది. ఆటకు ఆఖరి రోజైన ఆదివారం 115 పరుగుల స్వల్ప లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. 117/6 స్కోరు చేసి గెలిచింది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 234 రన్స్‌కు కుప్పకూలింది. నికిన్ జోస్ (109) శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 407.. సౌరాష్ట్ర 527 రన్స్ చేశాయి. మరో సెమీస్‌లో లెఫ్టామ్ స్పిన్నర్ ప్రదీప్త ప్రామాణిక్ (5/51) తిప్పేయడంతో బెంగాల్ 306 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంప్ మధ్యప్రదేశ్‌ను మట్టికరిపించింది. 548 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. ఆఖరిరోజు మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. రజత్ పటీదార్ (52) రాణించాడు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438, రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేయగా.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్ సాధించింది. గురువారం నుంచి ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే తుదిపోరులో సౌరాష్ట్రతో బెంగాల్ తలపడనుంది.