కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనెడ, పాలెం, రామకృష్ణాపురం, శృంగరాయుని పాలెం పరిసర ప్రాంతాలలో నీట మునిగిన పంట పొలాలను బిజెపి జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ బీజేపీ, జనసేన శ్రేణులతో కలిపి సందర్శించారు. రామవరం నుండి గోనెడ వెళ్ళే రహదారి గుండా కాలినడక వెళ్లి ఆయా ప్రాంతాలలో మునిగిన పొలాలను, పౌల్ట్రీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు బాలిన వెంకటేశ్వర రావు, జిల్లా కమిటీ మెంబర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సోషల్ మీడియా సభ్యులు పాలిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.