రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపుర్ గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాస్ కు చిన్ననాటి దోస్తులు కలిసి పదో తరగతి వరకు చదువుకున్న బాల్యమిత్రులు అందులో నారాయణపూర్ గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాస్ అనే వ్యక్తి గత నాలుగేళ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. తన కూతురు వివాహం సందర్భంగా శుక్రవారం పూర్వ విద్యార్థులు కలిసి 50వేల ఆర్థిక సహాయంతో పాటు, పుస్తె మట్టలు, 50 కిలోల బియ్యం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో 1988-89 బ్యాచ్ కు చెందిన వారు పాల్గొన్నారు.