కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేదితో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు సమావేశమై కేంద్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు త్వరగా వచ్చేలా చూడాలని, రామన్న కుంట చెరువు అభివృద్ధి, సుందరీకరణ చేయడానికి బోర్డు నుంచి త్వరగా NOC ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు అయిన 6 కోట్ల రూపాయలతో 4 UPHC ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని కోరడంతో పాటు నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చిన విషయాలను కిందిస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని సర్వీస్ చార్జీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి త్వరగా వచ్చేలా చూస్తానని CEO చెప్పారు


