ఎల్లారెడ్డిపేటకు చెందిన బాధ రాజు ఆదివారం కురిసిన భారీ వర్షంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలో కాలుకు చేతులకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతనిని సంఘటన స్థలం నుంచి సమీపంలో ఉన్న రైతులు అంబులెన్స్ కు సమాచారం అందించి అంబులెన్స్ లో సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య, జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆగయ్య, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మున్నూరు కాపు జిల్లా కమిటీ ప్రతినిధులు బండారి బాల్ రెడ్డి, ఇప్పపూల లక్ష్మన్, లింగన్నపేట బూస రాజు, లీగల్ సెల్ అధ్యక్షులు అడ్వకేట్ అంజయ్య మేకార్తి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్, గంభీరావుపేట మండల అధ్యక్షులు కూర సురేష్, ఎల్లారెడ్డిపేట మాజీ వార్డు మెంబర్ దేవేందర్, స్వామి గౌడ్ వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును సోమవారం పరామర్శించారు.