తమ నాలుగు నెలల చిన్నారి అన్విశ్రీ కి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ సబ్ సెంటర్లో వైద్య సిబ్బంది మూడవ టీకా వేసి వైద్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించగా టీకా బారినపడి మరణించిందని దానికి కారణమైన వైద్య సీబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బుర్కా రాకేష్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి 06 -06-2024 తేదీ నా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వైద్య సిబ్బందిని, రెవెన్యూ శాఖను, పోలీస్ శాఖను చిన్నారిని పూడ్చిపెట్టిన చోటనే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు, వారి ఆదేశాల మేరకు గిద్ద చెరువు స్మశాన వాటికలో చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గత సోమవారం పూడ్చిపెట్టారు పూడ్చిపెట్టిన అట్టి చిన్నారి అన్విశ్రీ మృతదేహాన్ని రెవెన్యూ, పోలీస్ శాఖ ఎదుట వైద్య బృందం ఫిర్యాదు దారు చిన్నారి తండ్రి రాకేష్ ఎదుట బొంద నుంచి వెలికి తీసి వైద్య బృందం శని వారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని వైద్య బృందం విలేకరులకు వెల్లడించారు. వైద్యులు చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు టీకా బారిన పడి చిన్నారి మరణించినట్లు తేలితే స్థానిక వైద్య సిబ్బందిపై వేటుపడే అవకాశాలు ఉన్నాయి. పోస్టుమార్టం వద్ద ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్, ఆర్ ఐ సంతోష్ లున్నారు,